బుమ్రా ప్రేమలో అనుపమ?


బుమ్రా ప్రేమలో అనుపమ?
Anupama Parameswaran

బుమ్రా ప్రేమలో అనుపమ?

ఇండియన్ స్టార్ క్రికెటర్, వరల్డ్ నంబర్ ఒన్ వన్డే ఇంటర్నేషనల్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో అనుబంధంలో ఉన్నదంటూ వదంతులు వస్తుండటంతో అందాల తార అనుపమా పరమేశ్వరన్ వార్తల్లో నిలిచింది. ట్విట్టర్‌లో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక నటి అనుపమ కావడం గమనార్హం. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో బుమ్రా కేవలం 25 మందినే ఫాలో అవుతున్నాడు. ఒకరి ట్వీట్లను మరొకరు బుమ్రా, అనుపమ లైక్ చేసుకుంటూ వస్తున్నారు. దాంతో వాళ్ల మధ్య అనుబంధం ఏర్పడిందనే ప్రచారానికి ఊతం లభించింది.

అయితే ఈ రూమర్స్‌కు స్పందించిన అనుపమ తామిద్దరూ మంచి స్నేహితులమని తెలిపింది. కేరళ కుట్టి అయిన అనుపమ ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించిన ‘రాక్షసుదు’ విడుదల కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండటం విశేషం.

ఒక తారతో కలిసి బుమ్రా పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు రాశీ ఖన్నాతో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని రాశి ఖండించింది కూడా.

బుమ్రా ప్రేమలో అనుపమ?

బుమ్రా ప్రేమలో అనుపమ? | actioncutok.com

More for you: