ప్రేక్షకుల తిరస్కారానికి గురైన ‘అభినేత్రి 2’


ప్రేక్షకుల తిరస్కారానికి గురైన 'అభినేత్రి 2'

ప్రేక్షకుల తిరస్కారానికి గురైన ‘అభినేత్రి 2’

ఫ్లాప్ సినిమా ‘అభినేత్రి’కి సీక్వెల్‌గా వచ్చిన ‘అభినేత్రి 2’ సైతం ప్రేక్షకుల నిరాదరణకు గురవుతున్నదని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. తొలి వారాంతంలో ఈ సినిమా వసూళ్లు రూ. కోటి (షేర్) కూడా వసూలు చెయ్యలేదని చెప్తున్నారు. ప్రభుదేవా, తమన్నా జోడీగా నటించిన ఈ సినిమాలో తమన్నా గ్లామర్, ప్రభుదేవా నటన ఆకట్టుకొనే రీతిలో ఉన్నా కథ కథనాలు ఆకర్షణీయంగా లేకపోవడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతోంది. దానికి ప్రచార లోపాలు తోడయ్యాయి.

డైరెక్టర్ విజయ్ టేకింగ్, సన్నివేశాల కూర్పు బలహీనంగా ఉండటం కూడా సినిమా వసూళ్లు ఆశించిన రీతిలో లేకపోవడానికి మరో కారణంగా కనిపిస్తోంది. ప్రేక్షకుల టాక్ కూడా దానికి తగ్గట్లే ఉంది. ఫలితం.. ఒరిజినల్ తరహాలోనే ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ప్రేక్షకుల తిరస్కారానికి గురైన ‘అభినేత్రి 2’ | actioncutok.com

More for you: