బాల‌య్య ‘రూల‌ర్‌’ అనుకున్నారా.. కానే కాదు!


బాల‌య్య 'రూల‌ర్‌' అనుకున్నారా.. కానే కాదు!

బాల‌య్య ‘రూల‌ర్‌’ అనుకున్నారా.. కానే కాదు!

‘జై సింహా’ త‌రువాత క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ – ద‌ర్శ‌కుడు కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సి.క‌ల్యాణ్ నిర్మాణంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ని టాక్‌. అందులో ఒక పాత్ర‌.. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ అని తెలిసింది. కాగా, ఈ చిత్రానికి ఆ మ‌ధ్య ‘రూల‌ర్‌’ అనే టైటిల్ క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్లు ప్ర‌ముఖంగా వార్త‌లు వినిపించాయి. అయితే, ఇప్పుడు టైటిల్‌లో మార్పు చోటుచేసుకుంద‌ని తెలిసింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి ‘క్రాంతి’ అనే పేరుని ఫిక్స్ చేసిన‌ట్లు టాక్‌. చిత్రంలో క‌థానాయ‌కుడి పాత్ర పేరు క్రాంతి అని.. అందుకే అదే టైటిల్‌ని ఖ‌రారు చేసే దిశ‌గా యూనిట్ ఆలోచిస్తోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది. ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌.. 2020 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

బాల‌య్య ‘రూల‌ర్‌’ అనుకున్నారా.. కానే కాదు! | actioncutok.com

More for you: