మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా!


– కార్తికేయ
మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా!
Alia Bhatt

మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా!

ఒక దశాబ్ద క్రితం వరకు టాలీవుడ్‌లోని టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్లుగా బాలీవుడ్ తారలే ఎక్కువగా కనిపించేవాళ్లు. శిల్పాశెట్టి, అమీషా పటేల్, సోనాలీ బెంద్రే, ప్రీతి జంగియాని, గ్రేసీ సింగ్, అమృతా రావ్, ఆయేషా టకియా, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే తర్వాత కాలంలో బాలీవుడ్ తారల రెమ్యూనరేషన్ తట్టుకోలేకపోవడమో, పేరుపొందిన బాలీవుడ్ తారలు తెలుగులో నటించడానికి ఆసక్తి చూపకపోవడమో.. మొత్తానికి వాళ్ల రాక తగ్గింది.

తమిళ, కన్నడ, మలయాళ భామలకు టాలీవుడ్‌లో గిరాకీ పెరిగింది. ఫలితంగా త్రిష, అసిన్, నయనతార, అనుష్క, మమతా మోహన్‌దాస్, సమంత, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, నిత్య మీనన్, కీర్తి సురేశ్, రశ్మికా మండన్న వంటి తారలు వరుసగా టాలీవుడ్‌లో పాగా వేశారు, వేస్తున్నారు.

మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా!
Aditi Rao Hydari

చూస్తుంటే ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ భామలపై టాలీవుడ్ గాలి మళ్లినట్లు కనిపిస్తోంది. పాన్-ఇండియా లుక్ రావడం కోసం బాలీవుడ్ తారల వైపు టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు చూపు సారిస్తున్నారు. పేరుకు హైదరాబాదీ నేపథ్యం ఉన్నప్పటికీ బాలీవుడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అదితిరావ్ హైదరి ‘సమ్మోహనం’ సినీమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘అంతరిక్షం’లో నాయికగా నటించిన ఆమె ఇప్పుడు తనను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తోంది.

మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా!
Shraddha Kapoor

ఇవాళ బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రభాస్ సరసన హీరోయిన్ ఛాన్స్ అనేసరికి తన కాల్షీట్లను సర్దుబాటు చేసుకొని మరీ ‘సాహో’లో నటించింది. ప్రభాస్ జోడీగా ఆమె కెమిస్ట్రీ సూపర్బ్ అని స్టిల్స్ తెలియజేస్తున్నాయి. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా.

ఇక అలియా భట్ అయితే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తార. ఆమె డైరీలో వచ్చే ఏడాది వరకూ ఖాళీ లేదు. కానీ రాజమౌళి సినిమాలో చెయ్యాలనే బలమైన కోరిక తన కాల్షీట్లను సర్దుబాటు చేసుకోనేలా చేసింది. అలా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’లో రాంచరణ్ జోడీగా నటిస్తోంది.

మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా!
Kiara Advani

బాలీవుడ్‌లో ‘ఫగ్లీ’, ‘ఎంఎస్ ధోని’ సినిమాలతో ఆకట్టుకున్న కియారా అద్వానీ తెలుగులో మహేశ్ సరసన ఛాన్స్ అనేసరికి మరో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలా ‘భరత్ అనే నేను’ సినిమాలో నాయికగా నటించి తెలుగు తెరకు పరిచయమైంది. దాని తర్వాత రాంచరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లోనూ నటించింది.

మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా!
Nidhi Agerwal

టైగర్ ష్రాఫ్ జోడీగా ‘మున్నా మైఖేల్’లో నటించిన నిధి అగర్వాల్‌కు వెంటనే మరో హిందీ ఆఫర్ రాలేదు. కానీ తెలుగులో వరుసగా ఇద్దరు అన్నదమ్ములతో కలిసి నటించే ఆ అవకాశం దొరికింది. మొదట నాగచైతన్యతో ‘సవ్యసాచి’ చేసిన అమె, ఆ వెంటనే అతని తమ్ముడు అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో నటించింది. తాజాగా రాం జోడీగా ‘ఇస్మార్ట్ శంకర్’ చేస్తోంది.

ఇలా ఒక్కరొక్కరుగా బాలీవుడ్ తారలు టాలీవుడ్ తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమాల కీర్తి దేశవ్యాప్తమవడమే దీకి కారణం. మున్ముందు మరింత మంది హిందీ తారలు తెలుగు తెరపై కాంతులీనడం ఖాయం.

మళ్లీ టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల హవా! | actioncutok.com

More for you: