చిట్ చాట్ విత్ ప్రభుదేవా


చిట్ చాట్ విత్ ప్రభుదేవా

చిట్ చాట్ విత్ ప్రభుదేవా

ఓ వైపు డైరెక్షన్.. ఇంకో వైపు యాక్టింగ్.. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

రెండూ నాకు ఇష్టమైన పనులు కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టమనిపించడం లేదు.

ఈ మధ్య నటుడిగా స్పీడ్ పెంచినట్లుంది?

అవకాశాలు వస్తున్నాయి. నచ్చిన వాటిని చేసుకుంటూ పోతున్నా. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తునాయి. హిందీలో ‘స్ట్రీట్ డాన్సర్’లో విష్ణు కేరెక్టర్ చేస్తున్నా. అది ‘ఏబీసీడీ’ సిరీస్‌లో మూడోది. ‘పొన్ మాణిక్యవేల్’ అనే తమిళ సినిమాలో తొలిసారి కాప్‌గా నటిస్తున్నా.

కొరియోగ్రఫీకి ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనా?

ఇప్పటికీ కొరియోగ్రఫీ చేయమని అడుగుతున్నారు. ఒకసారి చేస్తే మళ్లీ అదే చేయమని అడుగుతుంటారు. అందుకే నటన, డైరెక్షన్.. ఈ రెంటిమీదే దృష్టి పెడుతున్నా.

ఇప్పుడొస్తున్న కొరియోగ్రాఫర్లపై మీ అభిప్రాయం?

చాలా బాగా చేస్తున్నారు. గతంలో అంటే డాన్సర్స్ చాలా తక్కువగా ఉందేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది వస్తున్నారు. టీవీలో చూసి కూడా ఇంట్లోనే డాన్స్ నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా చానల్స్‌లో డాన్స్ షోస్ ఎక్కువగా వస్తున్నాయి. నేటి యూత్‌ను అవి బాగా ప్రభావితం చేస్తున్నాయి.

డాన్స్ ఇన్‌స్టిట్యూట్ పెట్టే ఆలోచన ఉందా?

అలాంటిదేమీ లేదు. ఇన్‌స్టిట్యూట్ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు చాలా మంది డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారుగా.

నటుడిగా ఎలాంటి కేరెక్టర్స్ చేయాలనుకుంటున్నారు?

ఫలానా తరహా పాత్రల్నే చెయ్యాలని నేనేమీ కోరుకోవడం లేదు. ప్రేక్షకులు ఇష్టపడే, ఆదరించే పాత్రలు చెయ్యాలనుకుంటాను. ఇలాంటి కేరెక్టర్సే చెయ్యాలని గిరిగీసుకొని కూర్చుంటే కష్టం. అన్ని రకాల పాత్రలు చేసి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించాలనుకుంటాను.

చిట్ చాట్ విత్ ప్రభుదేవా

చాలా గ్యాప్‌తో డైరెక్షన్ చెయ్యడం ఎలా ఉంది?

‘సింగ్ ఈజ్ బ్లింగ్’ డైరెక్ట్ చేసి నాలుగేళ్లయింది. నటుడిగా వరుస అవకాశాల వల్ల డైరెక్షన్ చెయడం వీలుపడలేదు. ‘దబాంగ్ 3’ని డైరెక్ట్ చెయ్యమని సల్మాన్ ఖాన్ నుంచి ఆఫర్ రావడంతో వదులుకోవాలనిపించలేదు. ‘వాంటెడ్’ తర్వాత ఆయనను డైరెక్ట్ చెయ్యడం ఆనందంగా ఉంది.

చిట్ చాట్ విత్ ప్రభుదేవా | actioncutok.com

More for you: