14 నిమిషాలు.. రూ. 14 కోట్లు!


14 నిమిషాలు.. రూ. 14 కోట్లు!

14 నిమిషాలు.. రూ. 14 కోట్లు!

పెళ్ళ‌య్యాక‌ కథానాయికల కెరీర్ అంత‌మ‌వుతుంద‌నే వాదన ఉంది. అయితే.. అది తప్పని నిరూపిస్తున్న భామల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోనే ఒకరు. పెళ్ళి త‌రువాత‌ కూడా సినిమాలతో బిజీ అవుతోన్న దీపిక..  ప్ర‌స్తుతం ‘చపాక్’తో పాటు త‌న‌ భర్త రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ’83’లోనూ న‌టిస్తోంది. కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో ఇండియాకి క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించిన జట్టు కథాంశంతో 83 తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ నటిస్తుండగా.. ఆయన భార్య రోమి దేవ్ పాత్రకి దీపికని ఎంపిక చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే, 14 నిమిషాల పాటు ఉండే ఆ పాత్రలో నటించడానికి దీపికకు  అక్ష‌రాలా రూ. 14 కోట్ల  పారితోషికం అందింద‌ని బాలీవుడ్ టాక్. హిందీనాట కొంతమంది అగ్ర క‌థానాయ‌కులు సైతం.. సినిమా ఆద్యంతం నటించినా ఇంత మొత్తం పారితోషికం అందుకోవడం కష్టమే. దీన్ని బ‌ట్టే చెప్పొచ్చు.. పెళ్ళ‌య్యాక కూడా దీపిక క్రేజ్ చెక్కుచెద‌ర‌లేద‌ని.

కబీర్ ఖాన్  దర్శకత్వం వహిస్తున్న ’83’.. 2020 ఏప్రిల్ 10న థియేట‌ర్ల‌లోకి రానుంది.  మ‌రి.. పెళ్లి తర్వాత మొద‌టిసారి కలసి నటిస్తున్న దీప్ వీర్ జోడీ.. ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి.

14 నిమిషాలు.. రూ. 14 కోట్లు! | actioncutok.com

More for you: