‘దిల్‌’ రాజు: బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాసర్స్


'దిల్‌' రాజు: బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాసర్స్
Dil Raju

‘దిల్‌’ రాజు: బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాసర్స్

స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్’ రాజు కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన సంవ‌త్స‌రాల‌లో 2017 ఒక‌టి. ఎందుకంటే.. ఆ ఏడాదిలో ఎన్న‌డూ లేని విధంగా ఆరు చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాకుండా డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు రాజు. క‌ట్ చేస్తే.. 2017 త‌ర‌హాలోనే ఇప్పుడు 2019 కూడా రాజుకి ప్ర‌త్యేకం అయ్యింది. ఎందుకంటే.. ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు త‌న సంస్థ నుంచి వ‌చ్చిన రెండు చిత్రాలు కూడా త‌మ బేన‌ర్‌లో బ్యాక్ టు బ్యాక్  హ‌య్య‌స్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి.

ఆ డిటైల్స్‌లోకి వెళితే,  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రాజు నిర్మించిన‌ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 2’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంతో త‌న కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాసర్‌ను అందుకున్నాడు ‘దిల్’ రాజు. కట్ చేస్తే.. ఆ సినిమా విడుద‌లైన నాలుగు నెల‌ల్లోపే వేస‌వి సంద‌ర్భంగా విడుద‌లైన ‘మహర్షి’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు రాజు. మహేశ్ బాబు హీరోగా అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరితో క‌ల‌సి రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ‘ఎఫ్ 2’కి మించిన వ‌సూళ్ళు చూడ‌డంతో.. ‘దిల్‌’ రాజు ఖాతాలో మ‌రో హ‌య్య‌స్ట్ గ్రాసర్ చేరిన‌ట్ల‌య్యింది.

మొత్త‌మ్మీద‌.. సంక్రాంతికి, వేస‌వికి  బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌ను అందించ‌డ‌మే కాకుండా.. ఆయా సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాసర్స్‌ను సాధించి కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు ‘దిల్’ రాజు.

‘దిల్‌’ రాజు: బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాసర్స్ | actioncutok.com

More for you: