తేజ మళ్లీ మొదటికొచ్చాడా?


తేజ మళ్లీ మొదటికొచ్చాడా?

తేజ మళ్లీ మొదటికొచ్చాడా?

‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ తర్వాత కొంత విరామం తీసుకొని తేజ రూపొందించిన సినిమా ‘సీత’. నాయిక కేంద్రంగా కథ నడిచే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించింది. తేజ డైరెక్షన్‌లో ఆమెకిది మూడో సినిమా. తేజ డైరెక్ట్ చేసిన ‘లక్ష్మీ కల్యాణం’ మూవీతోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు నాయికగా పరిచయమైంది.

తేజ మునుపటి సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లోనూ ఆమే నాయిక. ‘సీత’లో కాజల్ సరసన నాయకుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. మే 24న వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఫస్టాఫ్‌ను ఓ మాదిరిగా నడిపిన తేజ, సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యాడు. క్లైమాక్స్ విషయంలో మరీ నిరాశపర్చాడు. అందుకే ప్రేక్షకులు నిర్ద్వంద్వంగా ఆ సినిమాని తిరస్కరించారు. దీంతో ‘నేనే రాజు నేనే మంత్రి’ విజయం తేజకు గాలివాటుగా వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో వరుసగా ఆయనకు రెండు హిట్లు అనేవే లేవు. ఆ మాటకొస్తే ఎన్నో ఏళ్ల తర్వాత అతను ‘నేనే రాజు నేనే మంత్రి’తో హిట్ సాధించాడు. డైరెక్టర్‌గా కెరీర్ తొలినాళ్లలో తెలుగులో వరుసగా ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో హిట్లు సాధించాక ఆ ఫీట్ మళ్లీ అతడికి సాధ్యం కాలేదు.

ఇప్పుడు రొమాంటిక్ డ్రామా ‘సీత’తో ఆ ఫీట్‌ను ఆయన రిపీట్ చేసే అవకాశాలున్నాయని తేజ అభిమానులు గట్టిగా నమ్మారు. కానీ తేజ ‘సీత’ను తీసిన విధానంతో మళ్లీ మొదటికొచ్చేశాడని విమర్శలపాలయ్యాడు.

తేజ మళ్లీ మొదటికొచ్చాడా? | actioncutok.com

More for you: