‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కెరీర్ బెస్ట్ అవుతుందా?

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కెరీర్ బెస్ట్ అవుతుందా?
‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ అప్పటికే ఫిలించాంబర్ వద్ద రిజిస్టర్ కావడంతో చేసేది లేక తమ సినిమాకు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌తో సరిపెట్టుకున్నారు హీరో నాని, డైరెక్టర్ విక్రం కుమార్. తెలుగులో రూపొందించిన మునుపటి సినిమా ‘హలో’ ఫ్లాప్ కావడంతో విక్రం కుమార్ హతాశుడయ్యాడు. ఆ సినిమాని జనం తిరస్కరిస్తారని ఆయన ఏ మాత్రం ఊహించలేదు. అంతగా ఆ సబ్జెక్టును ఆయన నమ్మాడు. కానీ జనం మరో రకంగా భావించారు.
ఇప్పుడు ఆ ఫ్లాప్‌ను ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ హిట్‌తో పూడ్చుకోవాలనే తపనతో ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. కొంతమంది ఆడవాళ్ల గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించే యువకుడి కథతో ఈ సినిమాని ఆయన రూపొందిస్తున్నాడు. ఎమోషన్స్‌ను చక్కగా పలికించగలగడంతో పాటు కామెడీ టైమింగ్‌లోనూ సూపర్ అనిపించుకున్న నానిని ఆ రెండు కోణాల్లోనూ ఈ సినిమాలో విక్రం ప్రెజెంట్ చేస్తున్నాడు. సినిమా వస్తున్న తీరు చూస్తుంటే ఇటు నానికి, అటు విక్రంకూ కమర్షియల్‌గా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ‘జెర్సీ’ తెచ్చిన పేరుతో జోరుమీదున్న నాని ‘గ్యాంగ్ లీడర్’గా అలరించాలని ఉత్సాహంతో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 30న విడుదల కానున్నది.
‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కెరీర్ బెస్ట్ అవుతుందా? | actioncutok.com
More for you: