‘సాహో’ సైతం?


'సాహో' సైతం?

‘సాహో’ సైతం?

‘ర‌న్ రాజా ర‌న్‌’తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు సుజీత్‌. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం పొందిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌..  ఐదేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత త‌న రెండో చిత్రం ‘సాహో’తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ‘బాహుబ‌లి’ సిరీస్ త‌రువాత ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా కావ‌డంతో.. ‘సాహో’పై  స్కై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి తోడు భారీ బ‌డ్జెట్‌, భారీ తారాగ‌ణం తోడ‌వ‌డంతో.. ఈ చిత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

పాట‌ల చిత్రీక‌ర‌ణ మిన‌హా మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. సుజీత్ ఫ‌స్ట్ డైరెక్టోరియ‌ల్ మూవీ ‘ర‌న్ రాజా ర‌న్‌’ కూడా 2014లో ఇదే ఆగ‌స్టు నెల‌లో విడుద‌లై మంచి విజ‌యం  సాధించింది. ఈ నేప‌థ్యంలో ‘సాహో’ కూడా ఆ  సెంటిమెంట్‌ని రిపీట్ చేసి సుజీత్‌కి మ‌రో మెమ‌ర‌బుల్ హిట్‌ని అందిస్తుందేమో చూడాలి.

‘సాహో’ సైతం? | actioncutok.com

More for you: