ఫెయిల్యూర్స్ నన్ను ఆపలేకపోయాయి!

ఫెయిల్యూర్స్ నన్ను ఆపలేకపోయాయి!
జీవితంలో వైఫల్యాల్ని అంగీకరించడం ప్రస్తుత తరం నేర్చుకోవాలని మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అభిప్రాయపడ్డారు. సీబీఎస్ఈకి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన “నేను యావరేజ్ స్టూడెంట్‌ని. ఎక్కువ సౌకర్యాలు లేని కాలంలో నేను చదువుకున్నాను. ఇవాళ్టి స్టూడెంట్స్ చాలా లక్కీ. వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందరూ విజయమే లక్ష్యంగా ఉంటున్నారు. దాంతో గెలుపు అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. కానీ అది మితిమీరితే చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. మన చైతన్యాన్ని అది దెబ్బతీస్తుంది. వైఫల్యాల్ని అంగీకరించడం మనం నేర్చుకోవాలి” అని చెప్పారు మోహన్‌లాల్.
గెలుపనేది అరోగ్యం లాంటిదనీ, ఏ సమయంలోనైనా దాన్ని మనం కోల్పోవాల్సి వస్తుందనీ ఆయన అన్నారు. “నేటి తరం వైఫల్యాన్ని యాక్సెప్ట్ చెయ్యలేకపోతోంది. అందుకే జీవితంలోని చిన్న చిన్న వైఫల్యాలు కూడా వాళ్లను డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. నేను రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చేసిన చాలా సినిమాలు వైఫల్యం చెందాయి. అప్పుడు నేను చాలా బాధపడేవాడ్ని. కానీ ఆ వైఫల్యాలు నన్ను ఆపలేకపోయాయి.
సినిమా అనేది అనేకమంది సమష్ఠి కృషి. నా జీవితంలోని ప్రతి వైఫల్యం మరింత కష్టపడేందుకు నన్ను ప్రోత్సహించింది. అలా నేను వైఫల్యాల్ని అధిగమిస్తూ వస్తున్నా. కాబట్టి విజయాలు నన్ను మరీ సంతోషపెట్టవు. కేవలం చదువు మాత్రమే మంచి మనుషులుగా తయారు చెయ్యలేదు. దానికి విలువలు కూడా తోడవ్వాలి” అని చెప్పుకొచ్చారు మోహన్‌లాల్.
ఫెయిల్యూర్స్ నన్ను ఆపలేకపోయాయి! | actioncutok.com
More for you: