అతను చేస్తోంది ‘ఏక్ థా టైగర్’ రీమేకా?


అతను చేస్తోంది 'ఏక్ థా టైగర్' రీమేకా?
Gopichand

అతను చేస్తోంది ‘ఏక్ థా టైగర్’ రీమేకా?

క‌థానాయ‌కుడు గోపీచంద్, తమిళ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో  మెహ్రీన్, జ‌రీన్ ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవ‌ల రాజస్థాన్‌లో తొలి దశ చిత్రీకరణను  పూర్తిచేసుకున్న ఈ సినిమా..  ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను  జరుపుకుంటోంది. జూన్ 6 నుంచి ప్రారంభమైన ఈ  షెడ్యూల్‌లో గోపీచంద్‌పై కొన్ని పోరాట ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం.

ఇదిలా  ఉంటే.. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ స్పై ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడ‌ట‌. స్పై ఆఫీసర్ అనగానే అపర చాణిక్యుడిలా శ‌త్రువుల ఎత్తుల‌కి పై ఎత్తులు వేస్తూ వారిని అంతం చేయాలి. అందుకే ఈ సినిమాకు ‘చాణక్య’ అనే టైటిల్ అయితే యాప్ట్‌గా ఉంటుంద‌ని నిర్మాణ వ‌ర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఇది బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’కు రీమేక్‌గా వస్తున్న చిత్రమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ‘చాణక్య’ టైటిల్‌తో పాటు ఈ రీమేక్ వార్తలకు సంబంధించి కూడా త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.

కాగా.. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

మ‌రి.. ‘లౌక్యం’ త‌రువాత స‌రైన విజ‌యం లేని గోపీచంద్‌కు ‘చాణ‌క్య‌’ అయినా వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి.

అతను చేస్తోంది ‘ఏక్ థా టైగర్’ రీమేకా? | actioncutok.com

More for you: