వాళ్లిద్దరికీ హ్యాపీ ఎండింగ్‌!


వాళ్లిద్దరికీ హ్యాపీ ఎండింగ్‌!

వాళ్లిద్దరికీ హ్యాపీ ఎండింగ్‌!

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కబీర్ ఖాన్. ’83’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో.. 1983లో టీం ఇండియా ప్రపంచ కప్‌ను గెలిచిన తీరును చూపించబోతున్నాడు క‌బీర్‌. అదే సమయంలో ఆటగాళ్ల ఆట తీరుతో పాటు వారి భావోద్వేగాలు, మ‌నోభావాలు ఎలా ఉంటాయ‌నే అంశాల‌ను కూడా ఇందులో ట‌చ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే రణ్‌వీర్  క్రికెట్ మెళ‌కువలు నేర్చుకోవడంతో పాటు కపిల్‌కు చెందిన పలు విషయాలను తెలుసుకున్నాడు. ఇక కపిల్ దేవ్ భార్య రోమియో భాటియా పాత్రలో ర‌ణ్ వీర్ స‌తీమ‌ణి, న‌టి దీపికా పడుకోనే నటిస్తోంది. కేవలం 14 నిమిషాల‌ నిడివి కలిగిన ఈ పాత్రను చేసేందుకు.. దీపిక  ఏకంగా 14 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నట్టు బాలీవుడ్ ఖ‌బ‌ర్‌.

కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అదేమిటంటే.. ఇప్పటి వరకు రణ్‌వీర్, దీపిక   ‘గోలీయోం కీ రస్ లీల లీల రామ్‌లీల’, ‘బాజీరావ్ మస్తాని’, ‘పద్మావత్’ వంటి చిత్రాల్లో క‌లసి నటించారు. చిత్రంగా ఈ మూడు  సినిమాల్లో కూడా ఆ యా పాత్రలు (హీరో లేదా హీరోయిన్ లేదా ఇద్ద‌రూ) కొన్ని కారణాల వల్ల‌ చనిపోవడం జరుగుతుంది. కాని ‘83’ లో మాత్రం.. ఈ జంట బ్రతికే ఉంటుంది. పెళ్ళైన తర్వాత రణ్‌వీర్, దీపిక నటిస్తున్న తొలి  చిత్రం కావ‌డం.. అందులోనూ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కావడంతో పాటు ఈ జంట‌కు ఆన్‌స్క్రీన్‌పై ఫ‌స్ట్ టైమ్ హ్యాపీ ఎండింగ్ కావ‌డంతో ‘83’ మూవీ ఈ  జోడీకి వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. మ‌రి.. ఈ హ్యాపీ ఎండింగ్ ఫిల్మ్‌తో దీప్ వీర్ జోడీ ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

వాళ్లిద్దరికీ హ్యాపీ ఎండింగ్‌! | actioncutok.com

More for you: