ఇళయరాజా.. మీకిది తగునా?


ఇళయరాజా.. మీకిది తగునా?

ఇళయరాజా.. మీకిది తగునా?

‘ఇసై జ్ఞాని’గా గొప్పగా పిలుచుకొనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల తన ప్రవర్తనతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది కాలం క్రితం తన అనుమతి లేకుందా ఎవరూ తను స్వరాలు కూర్చిన పాటలు పాడేందుకు వీల్లేదనీ, తన పాటలు పడేట్లయితే తనకు రాయల్టీ చెల్లించాలనీ ప్రకటించి వివాదాన్ని రేపారు. ఆయన ప్రకటన ఎస్పీ బాలును సైతం బాధించింది. బహిరంగంగానే మేస్ట్రో వాఖ్యలపై విచారాన్ని వ్యక్తం చేశారు.

ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ఆ ఇద్దరూ కలవడంతో వివాదం సమసిపోయిందని అంతా సంతోషించారు. అయితే ఆ పుట్టినరోజు వేడుక సందర్భంగా జరిగిన సంగీత కచేరీలో తన ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు రాజా. ఆ కచేరీలో ఎస్పీ బాలుతో పాటు మరో విఖ్యాత గాయకుడు కె.జె. యేసుదాస్ కూడా పాల్గొన్నారు.

వాళ్ల సమక్షంలోనే రాజా ఒక సెక్యూరిటీ గార్డుతో దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఆ గార్డు చేసిన నేరం.. మంచినీళ్ల బాటిళ్లు ఇవ్వడానికి స్టేజిపైకి రావడం. అతన్ని చూసి “ఎందుకు స్టేజిపైకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావ్?” అని ప్రశ్నించారు రాజా. ఆ గార్డు మైకులో క్షమాపణలు చెప్పడమే కాకుండా రాజా కాళ్లకు నమస్కరించి వెళ్లిపోయాడు.

రాజా అంతటితో ఆగలేదు. ఆ కచేరీకి హాజరైన ప్రేక్షకుల్నీ కించపరిచారు. రూ. 10 వేలు ఇచ్చి బుక్ చేసుకున్నవారి సీట్లలో రూ. 500, రూ. 1000 పెట్టి సీట్లు కొనుక్కున్నవాళ్లు వచ్చి కూర్చున్నారని దుయ్యబట్టారు. దాంతో ఆయన ఎదురుగా కూర్చొని తిలకిస్తున్న ప్రేక్షకులు హతాశులయ్యారు.

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇళయరాజా.. మీకిది తగునా? | actioncutok.com

More for you: