రాసింది బాలయ్య కోసం.. చేస్తోంది మహేశ్‌తో!


రాసింది బాలయ్య కోసం.. చేస్తోంది మహేశ్‌తో!

రాసింది బాలయ్య కోసం.. చేస్తోంది మహేశ్‌తో!

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిలటరీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా దర్శనమివ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన అంశమొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.. ఈ సినిమా కథని ముందుగా నందమూరి బాలకృష్ణ కోసం సిద్ధం చేసుకున్నాడట దర్శకుడు అనిల్. వాస్త‌వానికి.. బాలకృష్ణ వందో చిత్రంగా ఈ కథను తెరకెక్కించాలని  ఈ యంగ్ డైరెక్ట‌ర్ ప్లాన్ చేసుకున్నాడట. కథానుసారం బాలయ్యను ఐఏఎస్ ఆఫీసర్‌గా చూపించాలని డిసైడ్ అయి.. ‘రామారావు గారు’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నాడట అనిల్. అనంతరం బాలయ్యను సంప్రదించడం.. కథ వినిపించడం చకచకా జరిగిపోయాయట‌. త‌న‌కు కథ నచ్చినా బాలయ్య మాత్రం ఎందుకో  స్క్రిప్ట్‌ని పక్కన పెట్టేసాడ‌ని టాక్.

అయితే.. తర్వాత అదే స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. క‌థానాయ‌కుడి పాత్ర‌ను పోలీస్ ఆఫీస‌ర్‌గా కాకుండా ఆర్మీ మేజ‌ర్‌గా మార్చి మహేశ్‌కు వినిపించాడట‌ అనిల్.  త‌న‌కు కథ నచ్చడంతో మహేశ్ వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడ‌ని సమాచారం. మొత్తానికి.. బాలయ్య కోసం రాసుకున్న కథ  కాస్త మహేశ్ చెంత‌కు చేరింద‌న్న‌మాట‌. మ‌రి.. చేతులు మారిన ఈ క‌థ అంతిమంగా ఎలాంటి ఫ‌లితాన్ని చూస్తుందో తెలియాలంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

రాసింది బాలయ్య కోసం.. చేస్తోంది మహేశ్‌తో! | actioncutok.com

More for you: