జూలై కేరాఫ్ interesting ప్రాజెక్ట్స్

జూలై కేరాఫ్ interesting ప్రాజెక్ట్స్
టాలీవుడ్‌కి ఈ వేసవి ఎమోషనల్ ఎంటర్టైనర్స్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. రానున్న జూలై మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌కి చిరునామాగా నిలవనుంది. ఎందుకంటే.. జూలై తొలి వారం మొదలు చివరి వారం వరకు ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. జూలై తొలివారంలో అంటే జూలై 5 లేదా 6న కొరియన్ మూవీకి రీమేక్‌గా రూపొందిన ‘ఓ బేబీ’ (సమంత) రిలీజ్ కానుండగా.. అదే వారంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘దొరసాని’ కూడా విడుదల కానుంది.

ఇక రెండో వారం విషయానికి వస్తే.. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రానున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే జూలై మూడోవారంలో అంటే జూలై 18న తమిళ చిత్రం ‘రాక్షసన్’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘రాక్షసుడు’ రానుంది. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.


ఇక చివరి వారంలో అంటే జూలై 26న ‘డియర్ కామ్రేడ్’ రాబోతోంది. ‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా కావడంతో.. ‘డియర్ కామ్రేడ్’ జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తమ్మీద.. ఈ జూలై నెల సినీ ప్రియులకు పసందైన వినోదాల విందును అందించే అవకాశముందన్నమాట.

జూలై కేరాఫ్ interesting ప్రాజెక్ట్స్ | actioncutok.com
More for you: