నాని హంతకుడా?

నాని హంతకుడా?
యువ కథానాయకుడు నానికి కలిసొచ్చిన దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘అష్టా చమ్మా’, ‘జెంటిల్ మన్’తో అలరించిన ఈ కాంబినేషన్.. ‘వి’ చిత్రం కోసం ముచ్చటగా మూడోసారి జట్టుకట్టింది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాని ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
కాగా, క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్‌గా కనిపిస్తాడట. అలాగే, హత్య చేసిన ప్రతీ సారి మర్డర్ జరిగిన ప్రదేశంలో ఓ క్లూ వదిలేస్తూ వెళతాడట. ఈ నేపథ్యంలో.. ఈ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చిన ప్రత్యేక అధికారి అయిన సుధీర్ బాబుకి, నానికి మధ్య నడిచే దోబూచులాటే ‘వి’ చిత్రమని టాలీవుడ్ టాక్.
నివేదా థామస్, అదితి రావ్ హైదరీ నాయికలుగా నటిస్తున్న ‘వి’ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుందని సమాచారం.
నాని హంతకుడా? | actioncutok.com
More for you: