కీర్తికి గెస్ట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్


కీర్తికి గెస్ట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్

కీర్తికి గెస్ట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్

‘మ‌హాన‌టి’ వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నాడు. న‌దియా, న‌రేశ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, భానుశ్రీ మెహ్రా వంటి తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో ప‌ది నిమిషాల పాటు సాగే ఓ ప‌వ‌ర్‌ఫుల్ గెస్ట్ రోల్‌కి స్కోప్ ఉంద‌ట‌. ఈ పాత్ర‌లో అగ్ర క‌థానాయ‌కుడు జూనియర్ ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని టాక్‌.  ప్ర‌స్తుతం ‘ఆర్ ఆర్ ఆర్‌’ షూటింగ్‌తో బిజీగా ఉన్న తార‌క్‌.. ప్ర‌స్తుతం సాగుతున్న షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే ఈ అతిథి పాత్ర తాలూకు షూటింగ్‌లో పాల్గొంటాడ‌ని వినిపిస్తోంది.

గ‌తంలో వెంక‌టేశ్ హీరోగా న‌టించిన ‘చింత‌కాయ‌ల ర‌వి’ (2008)లో ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసిన తార‌క్‌… సుదీర్ఘ విరామం త‌రువాత మ‌ళ్ళీ ఇప్పుడు ‘స‌ఖి’ (ప్ర‌చారంలో ఉన్న పేరు)లో అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌డం వార్త‌ల్లో నిలిచే అంశ‌మే.  మ‌రి.. తారక్ గెస్ట్ రోల్‌పై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా.. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

కీర్తికి గెస్ట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ | actioncutok.com

More for you: