కాజల్ కల తీరలేదు!


– సజ్జా వరుణ్
కాజల్ కల తీరలేదు!

కాజల్ కల తీరలేదు!

లేడీ ఓరిఎంటెడ్ సినిమా చెయ్యాలనీ, ఆ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగన ముద్ర వెయ్యాలనీ ప్రతి హీరోయిన్ కలగంటుంది. పదేళ్ల పైనా కెరీర్ ఉన్న హీరోయిన్‌కైతే ఆ కోరిక మరింత బలంగా ఉంటుంది. హీరో సరసన ఒక సపోర్టింగ్ కేరెక్టర్లా కనిపించే గ్లామరస్ రోల్స్ చేసీ చేసీ అలసిపోయినవాళ్లు తమకంటూ గుర్తింపు తెచ్చే, తమను సూపర్ హీరోయిన్‌ని చేసే సినిమా కోసం తపిస్తుంటారు. అలాంటి తపన ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.

గ్లామర్ పరంగా కాజల్ ఒక ‘చందమామ’ అనడంలో సందేహం లేదు. తను చేసిన ప్రతి పాత్రలోనూ రాణించింది. కానీ ఆమెను సూపర్ హీరోయిన్‌ను చేసే ఒక్క సినిమా ఆమెకి రాలేదు. తెలుగులో తనను ‘లక్ష్మీ కల్యాణం’ (2007)తో నాయికగా పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో ఎన్నో ఆశలతో ఆమె ‘సీత’ పాత్రను చేసింది. ఆత్మాభిమానం మెండుగా ఉన్న, సొంత వ్యక్తిత్వాన్ని కలిగిన ‘సీత’ తనను సూపర్ హీరోయిన్ ను చేస్తుందని ఆశించిన ఆమెకు ఆశాభంగమే ఎదురైంది. ‘సీత’ను ప్రేక్షకులు తిరస్కరించారు.

ఆమె తర్వాత వచ్చిన సమంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్‌తో దూసుకుపోతుండగా, నిన్న కాక మొన్న వచ్చిన కీర్తి సురేశ్ ‘మహానటి’గా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసేసింది. తెలుగమ్మాయి అంజలి సైతం ‘గీతాంజలి’గా ఆకట్టుకుంది. కాజల్ కంటే కాస్త ముందు వచ్చిన అనుష్క తెలుగులో, నయనతార తమిళంలో ఎప్పుడో సూపర్ హీరోయిన్స్ అయిపోయారు. కానీ కాజల్ కల ఇంకా నెరవేరలేదు.

‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ విడుదలై, విజయం సాధిస్తే అక్కడైనా లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హిట్ సాధించాననే సంతోషం ఆమెకు చేకూరుతుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా అనివార్య కారణాల వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు. అది వస్తే ఆమె దాహం కాస్తయినా తీరవచ్చు. ఏమవుతుందో చూద్దాం.

కాజల్ కల తీరలేదు!
Director Teja and Kajal Aggarwal on Sita sets

కాజల్ కల తీరలేదు! | actioncutok.com

More for you: