బన్నీ కోసం ఐటం గాళ్‌గా మారుతున్న ‘చందమామ’!

బన్నీ కోసం ఐటం గాళ్‌గా మారుతున్న ‘చందమామ’!
దశాబ్దకాలానికి పైగా హీరోయిన్గా రాణిస్తూ.. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కథానాయిక కాజల్ అగర్వాల్. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా ఓ ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ కోసం ‘చందమామ’ కాజల్ అగర్వాల్‌ను సంప్రదించిందట యూనిట్. పాట కాన్సెప్ట్ నచ్చడంతో కాజల్ కూడా ఈ ప్రత్యేక గీతానికి వెంటనే ఓకే చెప్పిందని టాక్.
గతంలో యన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’లో “పక్కా లోకల్’ అంటూ సందడి చేసిన ఈ టాలీవుడ్ చందమామ.. మరోసారి తన చిందులతో బన్నీ పక్కన కూడా కనువిందు చేస్తుందేమో చూడాలి.
బన్నీ కోసం ఐటం గాళ్‌గా మారుతున్న ‘చందమామ’! | actioncutok.com
More for you: