తేజ కోసం కాజ‌ల్ సాహసం!


తేజ కోసం కాజ‌ల్ సాహసం!
Kajal Aggarwal

తేజ కోసం కాజ‌ల్ సాహసం!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. తెలుగు తెర‌పై వ‌న్నె త‌ర‌గ‌ని అందం. 34 ఏళ్ళ ఈ టాలీవుడ్ చంద‌మామ‌.. స‌రిగ్గా ప‌న్నెండేళ్ళ క్రితం విడుద‌లైన ‘ల‌క్ష్మీ క‌ల్యాణం’తో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసింది. తేజ డైరెక్ట్ చేయగా ఇటీవల విడుదలైన ‘సీత’తో 50 చిత్రాల మైలురాయికి చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు వెండితెర‌పై వెలుగులు పంచ‌డానికే ప‌రిమిత‌మైన ఈ ఉత్త‌రాది సోయ‌గం.. అతి త్వ‌ర‌లో నిర్మాత అవ‌తార‌మెత్తుతోంది. అంతేకాదు.. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే బాధ్య‌త‌ల‌ను త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు, మార్గ‌ద‌ర్శి తేజ‌కి అప్ప‌గిస్తోంద‌ట కాజ‌ల్‌.

అస‌లే ‘సీత‌’ చేసిన గాయం ఇంకా మాన‌క‌ ముందే.. కాజ‌ల్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం సాహ‌సం అనే చెప్పాలి. మ‌రి.. కాజ‌ల్ న‌మ్మ‌కాన్ని తేజ ఏ మేర‌కు నిల‌బెట్టుకుంటాడో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు నిరీక్షించ‌క త‌ప్ప‌దు. అన్న‌ట్టు.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ లీడ్ రోల్ ప్లే చేయ‌బోతోందట‌.  ల‌క్ష్మీ, రాధ‌, సీత‌.. ఇలా పురాణ సంబంధిత పాత్ర‌ల పేర్ల‌తోనే కాజ‌ల్‌ని సిల్వ‌ర్‌స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తేజ‌.. ఈ సారి ఎలాంటి పేరుతో ఆమెని తెర‌పై చూపిస్తాడో చూడాలి మ‌రి.

తేజ కోసం కాజ‌ల్ సాహసం! | actioncutok.com

More for you: