ఆ దర్శకునితో కాజల్ రెండోసారి!


ఆ దర్శకునితో కాజల్ రెండోసారి!
Kajal Aggarwal

ఆ దర్శకునితో కాజల్ రెండోసారి!

ఇటీవల తేజ దర్శకత్వంలో సొంతంగా ఒక సినిమా నిర్మించాలని కాజల్ అగర్వాల్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవింకా సద్దుమణగక ముందే ఆమె మరో స్త్రీ ప్రధాన కథాంశంతో రూపొందే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఆ సినిమాని ‘అ!’, ‘కల్కి’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తాడనీ, సి. కల్యాణ్ నిర్మిస్తారనీ ఆ ప్రచార సారాంశం.

ఇదివరకు ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో ‘అ!’ సినిమా చేసింది కాజల్. అందులో ఆమె పాత్ర, ఆ పాత్రలో కాజల్ నటన విమర్శకుల ప్రశంసలు పొందాయి. ‘కల్కి’ సినిమా విడుదలకు ముందే కాజల్‌కు ప్రశాంత్ చెప్పిన సబ్జెక్ట్ నచ్చిందనీ, ఆ సబ్జెక్ట్ చెయ్యడానికి ఆమె ఓకే చెప్పిందనీ అంటున్నారు. ‘కల్కి’ విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి కూడా సి. కల్యాణ్ ఒక నిర్మాత. ఈ నేపథ్యంలో కాజల్ – ప్రశాంత్ సినిమా ఉంటుందా, లేదా అనేది త్వరలోనే స్పష్టం కానున్నది.

మరోవైపు శర్వానంద్ జోడీగా కాజల్ తొలిసారి నటించిన ‘రణరంగం’ ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.

ఆ దర్శకునితో కాజల్ రెండోసారి! | actioncutok.com

More for you: