‘భార‌తీయుడు 2’ని వ‌ద్ద‌నుకుంటున్న కాజ‌ల్?


'భార‌తీయుడు 2'ని వ‌ద్ద‌నుకుంటున్న కాజ‌ల్?

‘భార‌తీయుడు 2’ని వ‌ద్ద‌నుకుంటున్న కాజ‌ల్?

‘భార‌తీయుడు’.. 23 ఏళ్ళ క్రితం విడుద‌లైన ఈ పిరియాడిక్ డ్రామా అప్పట్లో ఓ సంచ‌ల‌నం.  క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. తొలి భాగంలో క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ క‌మ‌ల్ హాసన్, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ శంకర్ ఈ చిత్రం కోసం మ‌రోసారి జ‌ట్టుక‌ట్టారు.  లైకా ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న‌ ఈ సినిమా.. చాలా రోజుల క్రితమే ప్రారంభ‌మైంది. అయితే.. కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు కోలీవుడ్ టాక్.

అంతేకాదు.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి క‌థానాయిక‌ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ‘భారతీయుడు 2’ ఆలస్యం కావడంతో ఆ ప్రభావం తన అప్‌కమింగ్ మూవీస్ కాల్ షీట్స్‌పై పడొచ్చనే భావనతోనే కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాజల్ ‘కోమలి’(తమిళం), ‘రణరంగం’ (తెలుగు) చిత్రాల‌తో బిజీగా ఉంది. మరోవైపు.. ‘దిల్’ రాజు నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ శశి తెరకెక్కిస్తున్న సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటించనున్నట్టు ప్ర‌చారం సాగుతోంది.

‘భారతీయుడు 2’ విషయంలో కాజల్ నిర్ణయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘భార‌తీయుడు 2’ని వ‌ద్ద‌నుకుంటున్న కాజ‌ల్? | actioncutok.com

More for you: