‘కాజోల్’ బదులు ‘మెర్సిడెస్’ను చూసేవాళ్లం!


'కాజోల్' బదులు 'మెర్సిడెస్'ను చూసేవాళ్లం!
Kajol with her father Shomu Mukherjee

‘కాజోల్’ బదులు ‘మెర్సిడెస్’ను చూసేవాళ్లం!

బాలీవుడ్ అగ్రశ్రేణి తార కాజోల్ కొన్నేళ్ల క్రితం ‘బాజీగర్’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి సినిమాలతో కుర్రకారు కలల రాణిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సహ నటుడు అజయ్ దేవగణ్‌ను పెళ్లాడి జీవితంలో స్థిరపడిపోయింది. న్యాసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలకు తల్లయింది. కాగా తన పేరుకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పచుకుంది కాజోల్.

ఆమెకు మొదట తండ్రి షోము ముఖర్జీ ఏం పేరు పెట్టాలనుకున్నారో తెలుసా? ‘మెర్సిడెస్’ అని! అవును. ఈ విషయాన్ని కాజోల్ తెలియజేసింది. “నేను పుట్టినప్పుడు మా నాన్న నాకు ‘మెర్సిడెస్’ అని పేరు పెట్టాలనుకున్నారు. ఆయనకు మెర్సిడెస్ అనే పేరంటే ఇష్టం. మెర్సిడెస్ కార్ల కంపెనీ యజమాని తన కూతురి పేరుతో ఆ కంపెనీ పెట్టారు. అందుకని మా నాన్న కూడా తనకు కూతురు పుడితే ఆ పేరే పెట్టాలని అనుకున్నారు. ఈ విషయంలో అమ్మ (నటి తనూజ)కూ, నాన్నకూ పెద్ద యుద్ధమే జరిగిందంట. ‘మెర్సిడెస్’ అనే పేరు పెట్టడం కుదరదంటే కుదరదని అమ్మ తెగేసి చెప్పిందంట. అలా నాకు ‘మెర్సిడెస్’ పేరు తప్పిపోయింది” అని చెప్పుకొచ్చింది కాజోల్.

ఆమె తండ్రి మాట నెగ్గినట్లయితే మనం కాజోల్ బదులు ‘మెర్సిడెస్’ అనే పేరున్న తారను చూసేవాళ్లమన్న మాట.

‘కాజోల్’ బదులు ‘మెర్సిడెస్’ను చూసేవాళ్లం! | actioncutok.com

More for you: