మెహ్రీన్‌తో జోడీ కడుతున్న కల్యాణ్‌రామ్


మెహ్రీన్‌తో జోడీ కడుతున్న కల్యాణ్‌రామ్
Kalyan Ram and Mehreen

మెహ్రీన్‌తో జోడీ కడుతున్న కల్యాణ్‌రామ్

హీరో నందమూరి కల్యాణ్‌రామ్,  ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందనున్నది. పేరుపొందిన మ్యూజిక్ కంపెనీ ఆదిత్యా మ్యూజిక్ ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. కల్యాణ్‌రామ్ సరసన నాయికగా మెహ్రీన్ నటించనున్నది.

‘118’ సక్సెస్ తర్వాత సబ్జెక్టుల విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తున్న కల్యాణ్‌రాంకు సతీశ్ చెప్పిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ బాగా నచ్చింది. కుటుంబ విలువలతో పాటు, వినోదానికీ ఈ సినిమాలో పెద్ద పీట వేస్తున్నట్లు తెలిసింది. ‘శతమానం భవతి’ వంటి జాతీయ అవార్డు పొందిన, ప్రేక్షకుల ఆదరణను అమితంగా పొందిన సినిమా తర్వాత సతీశ్ రూపొందించిన ‘శ్రీనివాస కల్యాణం’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.

ఆ సినిమాలో ఎంతసేపూ మన సంస్కృతి గురించి ఉపన్యాసాలు దంచుతూ రావడం వల్ల స్క్రీన్‌ప్లే దెబ్బతిన్నదనీ, ప్రేక్షకులు బాగా విసుగుచెందారనీ, అందుకే ఆ సినిమా ఫ్లాపయ్యిందనీ విశ్లేషకులు తేల్చారు. అందుకని ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా పకడ్బందీ స్క్రీన్‌ప్లీతో, పక్కా స్క్రిప్టుతో సినిమా రూపొందించేసుకు సిద్ధమయ్యాడు సతీశ్.

గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.

మెహ్రీన్‌తో జోడీ కడుతున్న కల్యాణ్‌రామ్ | actioncutok.com

More for you: