కల్యాణ్ రామ్ – సతీశ్ వేగేశ్న సినిమా మొదలైంది


కల్యాణ్ రామ్ - సతీశ్ వేగేశ్న సినిమా మొదలైంది

కల్యాణ్ రామ్ – సతీశ్ వేగేశ్న సినిమా మొదలైంది

నందమూరి కల్యాణ్ రామ్‌ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తోన్న పేరుపెట్టని చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. కల్యాణ్ రామ్‌ జోడీగా మెహ్రీన్ నటించే ఈ సినిమాతో పేరుపొందిన మ్యూజిక్ కంపెనీ ఆదిత్యా మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు గోపిసుందర్ క్లాప్ కొట్టగా, జగదీశ్ గుప్తా కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర నిర్మాత ఉమేశ్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు. “జూలై 24 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుగుతుంది. నిర‌వ‌ధికంగా హైద‌రాబాద్‌, రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాలు, ఊటీలో చిత్రీక‌ర‌ణ చేస్తాం. స‌తీశ్ వేగేశ్న అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో సినిమా క‌థ‌ను సిద్ధం చేశారు” అని నిర్మాత‌లు తెలిపారు.

కల్యాణ్ రామ్ - సతీశ్ వేగేశ్న సినిమా మొదలైంది

వి.కె. నరేశ్, సుహాసిని, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తారాగణమైన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: గోపిసుందర్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: రామాంజనేయులు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న.

కల్యాణ్ రామ్ – సతీశ్ వేగేశ్న సినిమా మొదలైంది | actioncutok.com

More for you: