స్పెయిన్‌లో ‘సఖి’ సందడి

స్పెయిన్‌లో ‘సఖి’ సందడి
అభినేత్రి సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించిన ‘మహానటి’ చిత్రం.. గత ఏడాది వేసవికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా తరువాత కీర్తి సురేశ్‌ని.. ‘మహానటి’ (ఫేమ్) కీర్తి సురేశ్ అని పిలవడం మొదలుపెట్టేశారు జనం. కాగా, ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. నూతన దర్శకుడు నరేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రానికి ‘సఖి’ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ఈ నెల 13 నుంచి స్పెయిన్ పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్లో కీర్తి తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొననుంది. నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. దీంతో.. షూటింగ్ దాదాపు పూర్తవుతుందని టాక్.
కాగా, ఈ ఏడాది చివరలో ‘సఖి’ థియేటర్లలోకి సందడి చేయనుంది.
స్పెయిన్‌లో ‘సఖి’ సందడి | actioncutok.com
More for you: