మన్మథుడి బాహుబంధంలో ‘మ‌హాన‌టి’


మన్మథుడి బాహుబంధంలో 'మ‌హాన‌టి'

మన్మథుడి బాహుబంధంలో ‘మ‌హాన‌టి’

నాగార్జున కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం ‘మ‌న్మ‌థుడు’ (2002).  ఈ మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని స్ఫూర్తిగా తీసుకుని  న‌టుడు, యువ ద‌ర్శ‌కుడు రాహుల్ రవీంద్ర‌న్ ‘మ‌న్మ‌థుడు 2’ పేరుతో ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అత‌నికి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌మంత‌, కీర్తి సురేశ్ అతిథి పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే పోర్చుగ‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో దాదాపు నెల రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘మ‌న్మ‌థుడు 2’ టీమ్‌.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్‌ని మొద‌లుపెట్టింది. అంతేకాదు.. ఈ షెడ్యూల్‌లో ‘మ‌హాన‌టి’ కీర్తి సురేశ్ కూడా జాయిన్ అయింది. ఈ నేప‌థ్యంలో నాగ్‌, కీర్తిపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ద‌ర్శ‌కుడు రాహుల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో కీర్తి ఎంట్రీపై పోస్ట్ చేశాడు. నాగార్జున బాహుబంధంలో ఇమిడిపోయి నవ్వులు చిందిస్తున్న కీర్తి సురేశ్ ఫొటోను షేర్ చేశాడు.

అలాగే, కీర్తి కూడా నాగార్జున‌తో క‌ల‌సి న‌టించ‌డం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీటింది. నాగార్జున సైతం “ఇప్పుడు ‘మన్మధుదు 2’ ఫ్యామిలీలో ‘మహానటి’ కీర్తి సురేశ్ ఒక భాగం” అని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

కాగా, ‘మ‌న్మ‌థుడు 2’ నాగార్జున ష‌ష్టిపూర్తి సంద‌ర్భంగా ఆగ‌స్టు 29న రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.

మన్మథుడి బాహుబంధంలో ‘మ‌హాన‌టి’ | actioncutok.com

More for you: