నితిన్ జోడీగా ఆమె నిజమేనా?


నితిన్ జోడీగా ఆమె నిజమేనా?

నితిన్ జోడీగా ఆమె నిజమేనా?

‘మహానటి’ తెచ్చిన గొప్ప కీర్తి తర్వాత కీర్తి సురేష్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె నూతన దర్శకుడు నరేంద్రనాథ్ రూపొందిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

అది కాకుండా నగేశ్ కుకునూర్ తొలిసారి తెలుగులో దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనూ, హిందీలో అజయ్ దేవగన్ సరసన మరో మూవీలోనూ చేస్తోంది. ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ కావడం గమనార్హం.

కాగా నితిన్ జోడీగా కీర్తి ఒక సినిమా ఒప్పుకుందనే ప్రచారం తాజాగా ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తోంది. నితిన్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, మరొకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో.

ఇవి కాకుండా ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి అతను అఃగీకరించాడని వినిపిస్తోంది. ఇందులో నాయికగా కీర్తిని సంప్రదించారనీ, ఆమె కూడా ఓకే చెప్పిందనీ ప్రచారంలోకి వచ్చింది. అయితే దీన్ని ఎవరూ ధ్రువీకరించలేదు.

నితిన్ జోడీగా ఆమె నిజమేనా? | actioncutok.com

More for you: