కోలీవుడ్‌పై కన్నేసిన ‘కబీర్ సింగ్’ లవర్!


కోలీవుడ్‌పై కన్నేసిన 'కబీర్ సింగ్' లవర్!
Kiara Advani

కోలీవుడ్‌పై కన్నేసిన ‘కబీర్ సింగ్’ లవర్!

కియారా అద్వాని.. లేటెస్ట్ గ్లామ‌ర్ సెన్సేష‌న్‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో త‌న అంద‌చందాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి.. తాజాగా కోలీవుడ్ నుంచి కూడా పిలుపు వ‌చ్చింద‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే,  కోలీవుడ్ స్టార్ శివ‌కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా విఘ్నేశ్ శివ‌న్ (న‌య‌నతార ప్రియుడు) ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది. ఇందులో క‌థానాయిక పాత్ర కోసం కియారాని సంప్ర‌దించాడ‌ట ద‌ర్శ‌కుడు. క‌థ‌తో పాటు త‌న పాత్ర కూడా న‌చ్చ‌డంతో.. కియారా వెంట‌నే అంగీక‌రించింద‌ని కోలీవుడ్ టాక్‌. త్వ‌ర‌లోనే కియారా కోలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. తెలుగు, హిందీ భాష‌ల్లో త‌న గ్లామ‌ర్‌తో క‌వ్వించిన కియారా.. త‌మిళ తంబీల‌కూ క‌నువిందు చేస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే, కియారా తాజా హిందీ చిత్రం ‘క‌బీర్ సింగ్‌’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌) ఈ నెల 21న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

కోలీవుడ్‌పై కన్నేసిన ‘కబీర్ సింగ్’ లవర్! | actioncutok.com

More for you: