ఫస్ట్ చిరు.. నెక్ట్స్ తారక్!

ఫస్ట్ చిరు.. నెక్ట్స్ తారక్!
‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’.. ఇలా వరుస విజయాలతో అలరిస్తున్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం చిరంజీవితో తన తదుపరి సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు కొరటాల. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం.. ఆగస్టు 22న ప్రారంభం కానుందని సమాచారం. అలాగే వచ్చే ఏడాది వేసవి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాని.. మార్చి కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నాడట కొరటాల.
అంతేకాదు.. చిరు కాంబినేషన్ మూవీ తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను జూనియర్ ఎన్టీఆర్తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట కొరటాల. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ రూపొందిన విషయం విదితమే. ఇప్పుడు మరోసారి ఈ ద్వయం జట్టు కట్టనుందని టాలీవుడ్ టాక్. అలాగే, తారక్ సినిమాను 2020 మార్చిలో ప్రారంభించి.. అదే ఏడాది చివర్లో విడుదల చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అంటే.. 2020లో కొరటాల నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశముందన్నమాట. చూద్దాం.. ఏం జరుగుతుందో?
ఫస్ట్ చిరు.. నెక్ట్స్ తారక్! | actioncutok.com
More for you: