‘మహర్షి’తో మహేశ్ సాధించాడు!


'మహర్షి'తో మహేశ్ సాధించాడు!

‘మహర్షి’తో మహేశ్ సాధించాడు!

ఎట్ట‌కేల‌కు మ‌హేశ్ బాబు వంద కోట్ల షేర్‌ క్ల‌బ్‌లో చేరాడు. తాజా చిత్రం ‘మ‌హ‌ర్షి’తో ఈ ఫీట్‌ని సాధించాడు మ‌హేశ్‌. సోమ‌వారం నాటి వ‌సూళ్ళ‌తో క‌లుపుకుని ‘మ‌హ‌ర్షి’.. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ వంద కోట్ల క్ల‌బ్‌లో జాయిన్ అయింద‌ని ట్రేడ్ టాక్‌. మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా.. పోటీగా మ‌రో పెద్ద చిత్రం లేక‌పోవ‌డం, ‘మ‌హ‌ర్షి’ త‌రువాత వ‌చ్చిన సినిమాలేవీ అల‌రించ‌క‌పోవ‌డంతో.. ఈ స్థాయి వ‌సూళ్ళు సాధ్య‌మ‌య్యాయ‌ని ట్రేడ్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదివ‌ర‌కు వంద కోట్ల క్ల‌బ్‌లో ప్ర‌భాస్ (‘బాహుబ‌లి’ చిత్రాలు), చిరంజీవి (‘ఖైదీ నంబ‌ర్ 150’), రామ్ చ‌ర‌ణ్ (‘రంగ‌స్థ‌లం’) ఉండ‌గా.. ఇప్పుడు మ‌హేశ్‌కి కూడా స్థానం ద‌క్కిన‌ట్ల‌య్యింది. ‘బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌’ (తెలుగు వెర్ష‌న్‌) రూ. 310.25 కోట్ల షేర్‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా… ‘బాహుబ‌లి’ (తెలుగు వెర్ష‌న్‌) రూ.183.75 కోట్ల‌తో రెండో స్థానంలో ఉంది.

ఇక మూడో స్థానంలో ‘రంగ‌స్థ‌లం’ (రూ.119.7 కోట్ల షేర్‌),  నాలుగో స్థానంలో ‘ఖైదీ నంబ‌ర్ 150’ (రూ.102 కోట్ల షేర్‌) నిల‌చాయని ట్రేడ్ టాక్‌. ఇప్పుడు ఐదో స్థానంలో ‘మ‌హ‌ర్షి’ రూ.100 కోట్ల షేర్ క్ల‌బ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మున్ముందు.. ఈ జాబితాలో చేరే చిత్రాల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం లేక‌పోలేదు.

‘మహర్షి’తో మహేశ్ సాధించాడు! | actioncutok.com

More for you: