ర‌ష్మిక ఎంపిక‌ని ఇష్టపడని మహేశ్ ఫ్యాన్స్?


ర‌ష్మిక ఎంపిక‌ని ఇష్టపడని మహేశ్ ఫ్యాన్స్?

ర‌ష్మిక ఎంపిక‌ని ఇష్టపడని మహేశ్ ఫ్యాన్స్?

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాలతో అభిమానుల‌ను అల‌రించిన‌ మహేశ్ బాబు.. ప్ర‌స్తుతం ఫ్యామిలీతో క‌ల‌సి యూర‌ప్ ట్రిప్పుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హాలీడే ట్రిప్ అనంత‌రం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ షూటింగ్‌లో పాల్గొననున్నాడు మ‌హేశ్‌.  కాగా, ఈ హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో మహేశ్ స‌ర‌స‌న ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా నటిస్తున్న‌ విషయం విదితమే. అయితే, హీరోయిన్‌గా రష్మిక ఎంపికపై కొంతమంది మహేశ్ అభిమానులు నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. మహేశ్ పక్కన రష్మిక సూట్ కాదనే భావనలో.. వారు ఈ సెలక్షన్‌పై విముఖంగా ఉన్నట్టు సమాచారం.

అయితే, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాత్రం ‘ఛలో’, ‘గీతగోవిందం’ చిత్రాల్లో రష్మిక నటనను చూసి ఈ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్టు  పేర్కొంటున్నారు. అంతేకాదు.. రష్మికపై వారు ఎంతో నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే, సినిమా రిలీజ‌య్యాక ఫ్యాన్స్ అభిప్రాయం క‌చ్చితంగా మారుతుంద‌నే ఆశాభావంతో వారు ఉన్నార‌ట‌. కాగా, ఈ నెల 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతికి  విడుదల కానుంది.

ర‌ష్మిక ఎంపిక‌ని ఇష్టపడని మహేశ్ ఫ్యాన్స్? | actioncutok.com

More for you: