ట్రైన్ జర్నీలో మహేశ్ లవ్‌లో పడతాడా?


ట్రైన్ జర్నీలో మహేశ్ లవ్‌లో పడతాడా?
Mahesh

ట్రైన్ జర్నీలో మహేశ్ లవ్‌లో పడతాడా?

క‌థానాయ‌కుడు మహేశ్‌ బాబు,  ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ సంగ‌తి తెలిసిందే.  ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ ఈ సినిమాలో విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. ఈ నెలాఖ‌రు నుంచి పట్టాలెక్కనుందని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన క‌థ‌నం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.. ఈ చిత్రంలో మహేశ్‌ ఆర్మీ మేజ‌ర్‌ పాత్రలో దర్శనమివ్వనున్న విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో కొన్ని అనుకోని కారణాల వల్ల‌ కశ్మీర్ నుంచి ఆంధ్రాకు రైలు ప్రయాణం చేసే మ‌హేశ్‌.. ఆ జ‌ర్నీలోనే రష్మికతో ప్రేమలో పడతాడని సమాచారం.

ట్రైన్ జర్నీ నేపథ్యంలో సాగే ఈ లవ్ ట్రాక్‌లో మంచి ఫీల్ ఉంటుందనీ.. దీని కోసం ఓ బ్యూటిఫుల్ ట్రాక్‌ను చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసే ఆలోచనలో దర్శకుడు అనిల్ ఉన్నాడని సమాచారం. అంతేకాదు..  ఈ ట్రాక్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్‌. మరి ఈ ల‌వ్ ట్రాక్  జ‌నాల‌ను ఏ మేర‌కు రంజింప‌జేస్తుందో తెలియాలంటే  2020 సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

ట్రైన్ జర్నీలో మహేశ్ లవ్‌లో పడతాడా? | actioncutok.com

More for you: