స‌రికొత్త లుక్‌లో మ‌హేశ్‌


స‌రికొత్త లుక్‌లో మ‌హేశ్‌
Mahesh

స‌రికొత్త లుక్‌లో మ‌హేశ్‌

25వ చిత్రం ‘మ‌హ‌ర్షి’లో స్టూడెంట్ పాత్ర కోసం స‌రికొత్త లుక్‌లో క‌నిపించి అభిమానుల‌ను అల‌రించిన మ‌హేశ్ బాబు.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌లోనూ అదే తీరున కొన‌సాగనున్నాడ‌ట‌.

ఆ డిటైల్స్‌లోకి వెళితే, వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ త‌దుప‌రి చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌హేశ్ మొద‌టిసారిగా ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అంతేకాదు, పాత్ర డిమాండ్ మేర‌కు స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట‌. ఇందులో భాగంగా.. మిల‌ట‌రీ హెయిర్ స్టైల్‌, కోర మీసంతో  మ‌హేశ్ క‌నిపిస్తాడ‌ని టాక్‌. సో.. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’లో మ‌హేశ్ స‌రికొత్త లుక్ చూడాలంటే.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

కాగా, జూలై 5 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ చిత్రంలో మ‌హేశ్‌కి జోడీగా ర‌ష్మిక న‌టించ‌నుండ‌గా.. విజ‌య‌శాంతి, జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్, బండ్ల గ‌ణేశ్ ఇత‌ర ముఖ్య భూమిక‌ల‌ను పోషించ‌నున్నారు. అనిల్ సుంక‌ర‌, ‘దిల్‌’ రాజు, మ‌హేశ్ బాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స‌రికొత్త లుక్‌లో మ‌హేశ్‌ | actioncutok.com

More for you: