‘మహర్షి’ ఎఫెక్ట్: మళ్లీ వంశీతోనే!

‘మహర్షి’ ఎఫెక్ట్: మళ్లీ వంశీతోనే!
మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న వేసవి సందర్భంగా విడుదలై.. వసూళ్ళ వర్షం కురిపించింది. మహేశ్ కెరీర్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా నిలిచింది. ఓవర్సీస్, రాయలసీమలో మినహాయస్తే.. చాలా చోట్ల లాభాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో.. మహేశ్, వంశీ మరోసారి జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మహేశ్ కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తయ్యేలోపు పట్టాలెక్కుతుందని టాక్. అంతేకాదు, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా మహేశ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌కు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించిన ‘దిల్’ రాజు.. ఈ చిత్రాన్ని సోలో ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తాడని తెలిసింది. అలాగే ‘మహర్షి’ తరహాలోనే సమ్మర్ టార్గెట్‌గా ఈ సినిమా రాబోతోందని వినిపిస్తోంది. మరి.. ‘మహర్షి’ని మించిన ఫలితం అందుకుంటుందో లేదో చూడాలి.
‘మహర్షి’ ఎఫెక్ట్: మళ్లీ వంశీతోనే! | actioncutok.com
More for you: