‘మ‌న్మ‌థుడు 2’కి ఆధారం ఆ ఫ్రెంచ్ మూవీనా?


'మ‌న్మ‌థుడు 2'కి ఆధారం ఆ ఫ్రెంచ్ మూవీనా?

‘మ‌న్మ‌థుడు 2’కి ఆధారం ఆ ఫ్రెంచ్ మూవీనా?

వ‌య‌సు మళ్ళిన ఓ వ‌ర్జిన్ పెళ్ళి ప్ర‌య‌త్నాల స‌మాహారంగా తెర‌కెక్కిన చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా రాహుల్ ర‌వీంద్ర‌న్ రూపొందిస్తున్న ఈ సినిమాలో స‌మంత‌, కీర్తి సురేశ్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. గురువారం విడుద‌లైన టీజ‌ర్.. సినిమా ఎలా ఉండ‌బోతోందో క్లూ ఇచ్చింది. ఇంట్లో వాళ్ళ ముందు వ‌య‌సైన శ్రీ‌రాముడిలా, వెనుక శ్రీ‌కృష్ణుడిలా రెండు ఛాయ‌లున్న పాత్ర‌లో క‌థానాయ‌కుడు ఉంటాడ‌ని స్ప‌ష్ట‌మైంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

అదేమిటంటే.. ‘మ‌న్మ‌థుడు 2’ 2006లో విడుద‌లైన ఫ్రెంచ్ మూవీ ‘ఐ డూ’ ఆధారంగా తెర‌కెక్కుతోంద‌ని.. య‌థాత‌థంగా కాకుండా తెలుగు నేటివిటికి త‌గ్గ మార్పులు చేర్పుల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నార‌ని స‌మాచారం. ఇంత‌కీ ‘ఐ డూ’ క‌థ ఏమిటంటే… త‌ల్లి, తోబుట్టువుల బాగోగులు చూస్తూ నాలుగు ప‌దుల ప్రాయంలోకి వ‌చ్చినా పెళ్ళి చేసుకోని క‌థానాయ‌కుడికి.. పెళ్ళి ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లుపెడ‌తారు కుటుంబ స‌భ్యులు. ఈ నేప‌థ్యంలో.. వారు తెచ్చిన సంబంధాలేవీ న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌న‌కి వ‌చ్చిన ‘అద్దె భార్య‌’ అనే ఐడియాని అప్ల‌య్ చేస్తాడు హీరో.

అలా క‌థానాయ‌కుడి జీవితంలోకి వ‌చ్చిన క‌థానాయిక‌.. అత‌ని కుటుంబ స‌భ్యుల‌కి చేరువ‌కావ‌డం.. ఆ త‌రువాత హీరో మ‌న‌సుని గెలుచుకుని నిజంగానే అత‌ని జీవిత భాగ‌స్వామి కావ‌డం అనేది ఈ చిత్ర క‌థ‌. మ‌రి.. ఈ త‌ర‌హా క‌థ‌నాల‌తో తెలుగునాట ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. ఆద‌ర‌ణ పొందాయి. ‘మ‌న్మ‌థుడు 2’ కూడా అదే బాట ప‌డుతుందేమో చూద్దాం.

‘మ‌న్మ‌థుడు 2’కి ఆధారం ఆ ఫ్రెంచ్ మూవీనా? | actioncutok.com

More for you: