‘ఎఫ్ 2’ ఎఫెక్ట్: మెహ్రీన్ పరిస్థితి ఇదీ!

‘ఎఫ్ 2’ ఎఫెక్ట్: మెహ్రీన్ పరిస్థితి ఇదీ!
ఈ సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లో వచ్చేసింది పంజాబి భామ మెహ్రీన్. అంతకుముందు వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ బ్యూటీకి.. ‘ఎఫ్ 2’ విజయం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాదు, పలు అవకాశాలకు వేదికగా నిలచింది. ఇప్పటికే గోపీచంద్ ‘చాణక్య’, నాగశౌర్య ‘అశ్వథ్థామ’ చిత్రాల్లో నాయికగా నటిస్తున్న ఈ అమ్మడికి.. తాజాగా మరో మూడు ఛాన్స్‌లు దక్కాయట.
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ మూడు కూడా వేర్వేరు భాషలకి చెందిన చిత్రాలు కావడం విశేషం. తెలుగులో కల్యాణ్ రామ్ – సతీశ్ వేగేశ్న కాంబినేషన్లో రానున్న చిత్రంలో కథానాయికగా నటించనున్న మెహ్రీన్.. తమిళంలో ధనుష్‌తో ఓ సినిమా, కన్నడంలో దర్శన్‌తో ఓ చిత్రం కమిట్ అయ్యిందట. ఇవే కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌లో కూడా మెహ్రీన్ పేరు వినిపిస్తోంది. మొత్తానికి.. ‘ఎఫ్ 2’ తరువాత మెహ్రీన్ కాల్షీట్లకి డిమాండ్ పెరిగిందన్నమాట.
కాగా, మెహ్రీన్ తన మాతృభాష పంజాబీలో నటించిన తొలి చిత్రం ‘డీఎస్పీ దేవ్’ జూలై 5న రిలీజ్ కానుంది.
‘ఎఫ్ 2’ ఎఫెక్ట్: మెహ్రీన్ పరిస్థితి ఇదీ! | actioncutok.com
More for you: