‘సాహో’.. ఇట్స్ రిలీఫ్ టైమ్‌!


'సాహో'.. ఇట్స్ రిలీఫ్ టైమ్‌!

‘సాహో’.. ఇట్స్ రిలీఫ్ టైమ్‌!

‘ఇట్స్ షో టైమ్’ అంటూ రెండేళ్ళుగా ఊరిస్తూనే ఉన్నాడు ప్ర‌భాస్‌. ‘సాహో’ కోసం క‌ట్ చేసిన ‘ఇట్స్ షో టైమ్‌’ టీజ‌ర్.. యూ ట్యూబ్‌లో విడుద‌లై రెండేళ్ళు దాటినా.. స‌కాలంలో (2018లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు టీజ‌ర్‌లో ప్ర‌క‌టించారు) మాత్రం థియేట‌ర్ల‌లోకి రాలేక‌పోయాడు ప్ర‌భాస్‌.  ఎట్ట‌కేల‌కు.. 2019 ఆగ‌స్టు 15న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విడుద‌ల కాబోతున్న‌ట్లు కొన్నాళ్ళ క్రితం యూనిట్ ప్ర‌క‌టించేసింది.

త్రిభాషా చిత్రంగా రూపొందిన ‘సాహో’ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకే రోజున రిలీజ్ కానుంది. తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించి ఈ సినిమాకి పోటీగా మ‌రే క్రేజీ ప్రాజెక్ట్ ఆ స‌మ‌యంలో విడుద‌ల కావ‌డం లేదు. అయితే.. హిందీ వెర్ష‌న్‌కి మాత్రం గ‌ట్టి పోటీనే చూడాల్సిన ప‌రిస్ధితి ఎదురైంది ‘సాహో’కి.  అందుకు కార‌ణం.. అక్ష‌య్ కుమార్ ‘మిష‌న్ మంగ‌ళ్‌’తో పాటు జాన్ అబ్ర‌హాం ‘బాట్లా హౌస్‌’ కూడా అదే రోజున రిలీజ్ కాబోతున్న‌ట్లు ఆ యా చిత్ర నిర్మాణ సంస్థ‌లు ప్ర‌క‌టించ‌డ‌మే. దీంతో.. ‘సాహో’ ఓపెనింగ్స్‌పై ఆ రెండు చిత్రాల ప్ర‌భావం ఉంటుంద‌ని అంద‌రూ భావించారు.

అయితే.. ఇప్పుడు ‘సాహో’ టీమ్‌కి రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఏంటంటే.. ‘మిష‌న్ మంగ‌ళ్‌’ పంద్రాగ‌స్టున రావ‌డం లేద‌ట‌. ఇంకాస్త ముందుగానే అంటే ఆగ‌స్టు 9న రాబోతుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అంటే.. ‘సాహో’ టీమ్ ‘ఇట్స్ రిలీఫ్ టైమ్‌’ అనుకునే  మూమెంట్ అన్న‌మాట‌. మ‌రి.. ‘బాట్లా హౌస్‌’ కూడా అనుకున్న టైంకే వ‌స్తుందో?  లేదా రిలీజ్ షెడ్యూల్ మార్చుకుంటుందో?  చూడాలి.  ఏదేమైనా.. ‘సాహో’కి అనుకూల ప‌వ‌నాలు ఉన్న‌ట్లే ఉంది.

‘సాహో’.. ఇట్స్ రిలీఫ్ టైమ్‌! | actioncutok.com

More for you: