మోక్షజ్ఞ రాకకు ఇది సమయమేనా?


– వనమాలి
మోక్షజ్ఞ రాకకు ఇది సమయమేనా?
Mokshagna

మోక్షజ్ఞ రాకకు ఇది సమయమేనా?

నాలుగేళ్లుగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర పరిచయం గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. రేపో మాపో అతడు హీరోగా సినిమా మొదలవుతుందని అభిమానులు ఆశిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకూ వాళ్ల ఆశలు నెరవేరలేదు. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా అతడు పరిచయమవడం ఖాయమని యమ జోరుగా ప్రచారం నడిచింది. కానీ అది వాస్తవం కాలేదు.

ఇప్పుడు.. ఈ ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం ఖాయమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. న్యూయార్క్‌లో మోక్షజ్ఞ నటనలో, ఫిలింమేకింగ్‌లో శిక్షణ పొంది రావడమే దీనికి కారణం. ఒక స్టార్ డైరెక్టర్‌తో తన కొడుకును హీరోగా లాంఛ్ చెయ్యడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నాడనీ, విజయదశమి రోజు అందుకు ముహూర్తంగా నిర్ణయించారనీ కూడా ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు.

అయితే మోక్షజ్ఞ తెరంగేట్రానికి ఇది తగిన సమయమా, కాదా.. అనే చర్చ తాజాగా మొదలైంది. హీరో కావడానికి తగిన వయసు (22 ఏళ్లు) మోక్షజ్ఞకు ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు, ఎన్టీ రామారావు, బాలకృష్ణ అభిమానులు డీలాపడిపోయారు. ఈ వాతావరణంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయమైతే అభిమానుల్లో అంత జోష్ ఉండదనీ, మరికొంత కాలం గడిచాక సినిమాల్లోకి రావడం మంచిదనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు అభిమానులు ఇందుకు విరుద్ధమైన వాదన వినిపిస్తున్నారు. నిరాశకు గురై ఉన్న తెలుగుదేశం అభిమానులు, బాలకృష్ణ అభిమానుల్లో జోష్ తీసుకు రావడానికి మోక్షజ్ఞ రాక ఉపకరిస్తుందని వాళ్లంటున్నారు. నిజానికి రాజకీయాలకూ, సినిమాలకూ సంబంధం లేకపోయినా, మోక్షజ్ఞ సినిమా మొదలైతే అభిమానులంతా ఒకచోట కలిసే అవకాశం ఏర్పడుతుందనీ, తిరిగి వారిలో ఉత్తేజం కలుగుతుందనీ వాళ్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినట్లయితే ఈ చర్చకు అవకాశం ఉండేది కాదు. మరి.. తనయుడి విషయంలో బాలయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.          

మోక్షజ్ఞ రాకకు ఇది సమయమేనా?   | actioncutok.com

More for you: