షూటింగ్‌లో గాయపడ్డ నాగశౌర్య


షూటింగ్‌లో గాయపడ్డ నాగశౌర్య

షూటింగ్‌లో గాయపడ్డ నాగశౌర్య

యువ హీరో నాగశౌర్య షూటింగ్‌లో గాయపడ్డాడు. సొంత బేనర్ ఐరా క్రియేషన్స్‌లో ‘అశ్వత్థామ’ అనే సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. రమణతేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ విజాగ్‌లో జరుగుతోంది. మెహ్రీన్ నాయిక. శుక్రవారం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, రోప్ సాయం కానీ, డూప్ సాయం కానీ లేకుండా స్టంట్స్ చేస్తున్న నాగశౌర్య ప్రమాదవశాతూ కిందపడటంతో అతని ఎడమ మోకాలిపైన గట్టి దెబ్బ తగిలింది. దాంతో అతను బాధతో విలవిలలాడిపోయాడు.

వెంటనే సినిమా యూనిట్ అతడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కాలి కండరానికి బలమైన దెబ్బ తగిలందనీ, కనీసం 25 రోజులు విశ్రాంతి తీసుకోవాలనీ డాక్టర్లు సూచించారు.

షూటింగ్‌లో గాయపడ్డ నాగశౌర్య

షూటింగ్‌లో గాయపడ్డ నాగశౌర్య | actioncutok.com

More for you: