‘మ‌నం’ తర్వాత మ‌రోసారి..


'మ‌నం' తర్వాత మ‌రోసారి..
Naga Chaitanya, Samantha and Nagarjuna

‘మ‌నం’ తర్వాత మ‌రోసారి..

అక్కినేని ఫ్యామిలీకి మెమ‌రబుల్ మూవీగా నిల‌చిన చిత్రం ‘మ‌నం’.  ఏయ‌న్నార్‌, నాగార్జున‌, నాగ‌చైత‌న్య  ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాలో అక్కినేని అమ‌ల‌, అఖిల్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌గా.. స‌మంత ఓ క‌థానాయిక‌గా న‌టించింది. క‌ట్ చేస్తే.. 5 ఏళ్ళ విరామం త‌రువాత నాగ్‌, చైతూ, స‌మంత కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంద‌ని టాలీవుడ్ టాక్‌.

ఆ డిటైల్స్‌లోకి వెళితే, ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ పేరుతో నాగ్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణ్ కృష్ణ రూపొందించ‌నున్న ఈ చిత్రంలో బంగార్రాజు మ‌న‌వ‌డి పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టించ‌నుండ‌గా, అత‌నికి జోడీగా స‌మంత ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. ‘మనం’ త‌రువాత నాగ్‌, చైతూ, సామ్ త్ర‌యంలో వ‌చ్చే సినిమా ఇదే అవుతుంది. మ‌రి.. ‘మ‌నం’ మ్యాజిక్‌ని ఈ ట్ర‌యో ఏ మేర‌కు రిపీట్ చేస్తుందో తెలియాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

‘మ‌నం’ తర్వాత మ‌రోసారి.. | actioncutok.com

More for you: