బాలకృష్ణ 105వ సినిమా మొదలైంది


బాలకృష్ణ 105వ సినిమా మొదలైంది

బాలకృష్ణ 105వ సినిమా మొదలైంది

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న 105వ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమాని హ్యాపీ మూవీస్ బేనర్‌పై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ వి.వి. వినాయక్ క్లాప్ కొట్టగా, మరో డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి ఈ సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

అధికారికంగా ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తుండగా, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎం. రత్నం సంభాషణలు రాస్తున్నారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. ‘జై సింహా’ తర్వాత బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్, సి. కల్యాణ్ కాంబినేషన్‌లో ఈ సినిమా తయారవుతుండటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘క్రాంతి’ అనే టైటిల్ల్ పరిశీలనలో ఉంది.

బాలకృష్ణ 105వ సినిమా మొదలైంది

బాలకృష్ణ 105వ సినిమా మొదలైంది | actioncutok.com

More for you: