పాపం.. సాయిపల్లవి!

పాపం.. సాయిపల్లవి!
సాయిపల్లవి.. ఈ పేరు రెండేళ్ళ క్రితం ఓ సంచలనం. మలయాళంలో ‘ప్రేమమ్’ (2015), తెలుగులో ‘ఫిదా’ (2017) చిత్రాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి.. రెండు చోట్లా తొలి సినిమాలతో బ్లాక్బస్టర్లు దక్కాయి. అలాగే నటిగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే.. తమిళంలో మాత్రం తన పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. గత ఏడాది ‘దియా’తో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవికి.. మొదటి సినిమా ఫలితం నిరాశపరిచింది. ఇక అదే సంవత్సరాంతంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మారి 2’ కూడా విజయాన్ని అందివ్వలేకపోయింది.
ఈ నేపథ్యంలో.. తన అభిమాన కథానాయకుడు సూర్య కాంబినేషన్లో నటించిన ‘ఎన్జీకే’పైనే బోలెడు ఆశలను పెట్టుకుంది పల్లవి. అయితే.. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గత రెండు తమిళ చిత్రాల కంటే పేలవమైన ఫలితాన్ని పొందింది. అటు టాక్, ఇటు కలెక్షన్స్.. రెండూ కూడా నిరాశజనకంగా ఉన్నాయి. అంతేకాదు.. తమిళనాట సాయిపల్లవికి ఈ హ్యాట్రిక్ ఫ్లాపులతో ఐరెన్లెగ్ ఇమేజ్ దక్కింది. చూస్తుంటే.. అక్కడ కొత్త అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. పాపం.. సాయిపల్లవి!
పాపం.. సాయిపల్లవి! | actioncutok.com
More for you: