నితిన్ – కీర్తి సురేష్ జోడీగా ‘రంగ్ దే’


నితిన్ - కీర్తి సురేష్ జోడీగా 'రంగ్ దే'

నితిన్ – కీర్తి సురేష్ జోడీగా ‘రంగ్ దే’

ఇటీవల వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న నితిన్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా ఆసక్తికర సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘ భీష్మ’ సినిమా చేస్తున్న నితిన్.. నిన్ననే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా మొదలు పెట్టాడు. తాజాగా ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో మరో సినిమాని ప్రకటించాడు.

నితిన్ - కీర్తి సురేష్ జోడీగా 'రంగ్ దే'

ఆ చిత్రానికి ‘రంగ్ దే’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇందులో నితిన్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండటం. ‘మన్మథుడు 2’లో అతిథి పాత్ర పోషించిన కీర్తి, ‘సఖి’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. వాటి తర్వాత ఆమె ఒప్పుకున్న తెలుగు సినిమా ఇదే.

కాగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే ‘రంగ్ దే’ని 2020 వేసవిలో విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు.

నితిన్ - కీర్తి సురేష్ జోడీగా 'రంగ్ దే'

నితిన్ – కీర్తి సురేష్ జోడీగా ‘రంగ్ దే’ | actioncutok.com

More for you: