‘చిత్రలహరి’ సుందరి బన్నీ సరసన చేరింది!


'చిత్రలహరి' సుందరి బన్నీ సరసన చేరింది!
Nivetha Pethuraj

‘చిత్రలహరి’ సుందరి బన్నీ సరసన చేరింది!

‘జులాయి’, ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ చిత్రాల త‌రువాత అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ట‌బు, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌వ‌దీప్‌, సుశాంత్‌, సునీల్‌.. ఇలా భారీ తారాగ‌ణ‌మే సంద‌డి చేయ‌నుంది.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌కి ‘మెంట‌ల్ మ‌దిలో’ ఫేమ్ నివేదా పేతురాజ్ ఎంపికైంద‌ని తెలిసింది. వాస్త‌వానికి ఈ పాత్ర కోసం అంత‌కుముందు కేథ‌రిన్ ట్రెసా, కేతిక శ‌ర్మ వంటి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే, చివ‌రాఖ‌రికి ఆ పాత్ర నివేదాకి ద‌క్కింద‌ని టాక్‌. అంతేకాదు, తాజాగా మొద‌లైన సెకండ్ షెడ్యూల్‌లో నివేదా కూడా జాయిన్ అయిందనేది ఇన్‌సైడ‌ర్స్ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌.

‘మెంటల్ మ‌దిలో’ త‌రువాత ‘చిత్ర‌ల‌హ‌రి’లో క‌నిపించిన నివేదా.. విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ ‘బ్రోచేవ‌రెవ‌రురా’లోనూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. బ‌న్నీ కాంబినేష‌న్ మూవీ త‌రువాత నివేదా ఖాతాలో మ‌రిన్ని బిగ్ టికెట్ ఫిల్మ్స్ చేర‌తాయేమో చూడాలి.

‘చిత్రలహరి’ సుందరి బన్నీ సరసన చేరింది! | actioncutok.com

More for you: