‘ఓ బేబీ’ ట్రైలర్ చెబ్తున్న నిజాలివే!


– సజ్జా వరుణ్
'ఓ బేబీ' ట్రైలర్ చెబ్తున్న నిజాలివే!

‘ఓ బేబీ’ ట్రైలర్ చెబ్తున్న నిజాలివే!

సమంత ప్రధాన పాత్ర చేసిన ‘ఓ బేబీ’ ట్రైలర్ వచ్చేసింది. బీవీ నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంత కొత్తగా ఉండబోతున్నదో, భావోద్వేగాలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేయనున్నదో, మనల్ని ఎలా నవ్వించనున్నదో, ఎలా ఏడ్పించనున్నదో, ఎలా ప్రేమలో పడేయనున్నదో.. 2.12 నిమిషాల చిన్న ట్రైలర్ తెలియ జేస్తోంది. 70 ఏళ్ల బేబీ (లక్ష్మి)ని దేవుడు 24 ఏళ్ల అందమైనా అమ్మాయిగా మార్చేశాడని బేబీ స్నేహితుడు (రాజేంద్రప్రసాద్) మాటల వల్ల అర్థమవుతుంది.

మరి అందమైన అమ్మాయిని అబ్బాయిలు ఊరికే వదిలి పెడతారా? అందరి కళ్లూ ఆమె మీదే. మొత్తానికి ఒక అబ్బాయి (నాగశౌర్య) ఆమెకు స్నేహితుడై, సన్నిహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి మందు కూడా కొడతారు. అలాంటి ఒక సందర్భంలో ఆ అబ్బాయి బేబీని “మంచి హజ్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావ్?” అనడిగాడు. “చూట్టానికి అందంగా ఉండాలి. నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులుండాలి. మంచమెక్కితే.. ఊ.. మగాడిలా కాపురం చెయ్యాలి” అని చెప్పింది బేబీ.

'ఓ బేబీ' ట్రైలర్ చెబ్తున్న నిజాలివే!

పడుచు యువతిలా మారిన బేబీ తన ఇంట్లో వాళకే కొత్తగా పరిచయమవుతుంది. అయితే ఆమె అలా మారిన సంగతి స్నేహితుడికి తెలుసు. ఒక రాత్రివేళ ఆ ఇద్దరూ ఒక గదిలో, ఒక మంచంపై ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి ఒక స్త్రీ చూసేసి గుండెలు బాదుకుంటుంది. అక్కడ బేబీకీ, ఆమె స్నేహితుడుకీ మధ్య ఏం జరిగిందనేది మనకు తెలీదు.

చిత్రమేమంటే బేబీ మనవడు ఆమెతో రెస్టారెంట్లో “మీకో విషయం చెప్పాలి. చెప్తే ఎలా రియాక్టవుతారోనని భయంగా ఉంది” అంటే, నిర్ఘాంతపోయిన బేబీ మనసులోనే “నానమ్మనురా నీకు. చెప్తే చంపేస్తాను చచ్చినోడా” అనుకుంటుంది. అంటే ఆ మనవడు తనకు లవ్ ప్రపోజల్ చెయ్యబోతున్నాడని బేబీ ఊహించుకున్నదన్న మాట. మరి ఆ మనవడు ఏం చెప్పాడో, బేబీ ఏం చేసిందో అన్నది ఆసక్తికరం. బేబీ కుర్రదిలా మారేసరికి తాను కూడా కుర్రాడిలా మారాలని స్నేహితుడు చాలా కష్టపడ్డాడనీ, కసరత్తులు చేశాడనీ తెలుస్తోంది.

'ఓ బేబీ' ట్రైలర్ చెబ్తున్న నిజాలివే!

అనుకోకుండా వృద్ధురాలి నుంచి యువతిలా మారేసరికి బేబీని వయసు అల్లరి పెట్టకుండా ఉంటుందా? కచ్చితంగా పెట్టింది. అందుకే “దేవుడు వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలిప్పుకుంటోంది” అని చెప్పింది కన్నీళ్లు పెట్టుకుంటూ.

కథలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బేబీ ఏ రూపంలోకి మారిందో, ఆ రూపం కలిగిన ఆమె అదివరకే ఉంది. ఆమె భర్తగా అడివి శేష్ కనిపించాడు. అతని వేషధారణ చూస్తే ఆర్మీలో పనిచేస్తున్నాడని అర్థమవుతుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఏడుస్తూ పాపను సముదాయించేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. ఆమె ఉన్న ఇల్లు చూస్తే కడు పేదరికంలో ఉన్నదానిలా అనిపిస్తోంది.

'ఓ బేబీ' ట్రైలర్ చెబ్తున్న నిజాలివే!

ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ఏమైంది? ఆమె రూపం బేబీకి ఎందుకొచ్చింది? పాతికేళ్ల లోపు పడుచమ్మాయిలా మారిన ఆమె 70 ఏళ్ల బేబీ అని తెలిశాక ఆమెను ప్రేమించిన వాళ్ల స్థితి ఏమిటి? వయసు రెక్కలిప్పుకుంటోందన్న బేబీ ఎమేం పనులు చేసింది? వాటి పర్యవసానాలు ఏమిటి?.. ఈ ప్రశ్నలన్నింటికీ జూలై 5న సమాధానాలు లభించనున్నాయి.

‘ఓ బేబీ’ ట్రైలర్ చెబ్తున్న నిజాలివే! | actioncutok.com

More for you: