‘సాహో’లో పాయ‌ల్ చిందులు?


'సాహో'లో పాయ‌ల్ చిందులు?

‘సాహో’లో పాయ‌ల్ చిందులు?

‘ఆర్ ఎక్స్ 100’తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. తొలి చిత్రంతోనే కుర్ర‌కారుని ఫిదా చేసిన ఈ నార్త్ ఇండియ‌న్ బ్యూటీ.. ఇప్పుడు చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. ఒక వైపు హీరోయిన్‌గా న‌టిస్తూనే.. మ‌రో వైపు ప్ర‌త్యేక గీతాల్లోనూ ద‌ర్శ‌న‌మిస్తోంది పాయ‌ల్‌.

తాజాగా ‘సీత‌’ చిత్రంలో ‘బుల్ రెడ్డి’ పాట‌లో త‌న నృత్యాల‌తో అల‌రించిన ఈ సుంద‌రికి.. ఇప్పుడు ఓ బిగ్ టికెట్ ఫిల్మ్‌లో ఐట‌మ్ సాంగ్ చేసే ఛాన్స్ ద‌క్కింద‌ట‌. ఆ సినిమా మ‌రేదో కాదు.. ‘సాహో’.

‘బాహుబ‌లి’ సిరీస్ త‌రువాత ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఓ ప్ర‌త్యేక గీతంలో మెరిసే అవ‌కాశం పాయ‌ల్‌కి ద‌క్కింద‌ని స‌మాచారం.  క‌ల‌ర్‌ఫుల్ సెట్‌లో ఈ పాట‌ని పిక్చ‌రైజ్ చేస్తార‌ని, ‘సాహో’కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చేలా ఈ గీతం ఉంటుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ‘సాహో’లో పాయ‌ల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘సాహో’ ఆగ‌స్టు 15న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది.

‘సాహో’లో పాయ‌ల్ చిందులు? | actioncutok.com

More for you: