కానిస్టేబుల్‌ను కొట్టిన బీజేపీ మహిళా ఎంపీ!


కానిస్టేబుల్‌ను కొట్టిన బీజేపీ మహిళా ఎంపీ!

కానిస్టేబుల్‌ను కొట్టిన బీజేపీ మహిళా ఎంపీ!

బీజేపీ ఎంపీ రేఖా వర్మ తనపై చేయి చేసుకొని, అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్యాం సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్కార్ట్ డ్యూటీ కింద మొహమ్మది కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో శ్యాం సింగ్‌కు పోస్టింగ్ ఇచ్చారు.

ఎంపీ కారుకు ఎస్కార్టింగ్‌గా ఉన్న కారులో శ్యాం సింగ్ కూర్చొని ఉన్నాడు. హఠాత్తుగా, ఎంపీ నిగ్రహాన్ని కోల్పోయి, తన కారులోంచి దిగి, డ్యూటీ సరిగా చేయడం లేదంటూ తనపై చేయిచేసుకున్నారనేది శ్యాం సింగ్ ఆరోపణ. బహిరంగంగా ఇతరులు చూస్తుండగా, ఆమె తనను కొట్టి, దుర్భాషలాడారని ఆయన ఆరోపించాడు. తన యూనిఫాంను విప్పేస్తానని కూడా ఆమె అన్నారని తన ఫిర్యాదులో శ్యాం సింగ్ పేర్కొన్నాడు. ఆయన ఫిర్యాదు మేరకు మొహమ్మది కొత్వాలి స్టేషన్‌లో 504, 506, 332, 353 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఫిర్యాదుపై ఎంపీ రేఖా వర్మ ఇప్పటివరకూ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ధౌరారా నియోజకవర్గంలో రేఖా వర్మ బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ ఓడించారు.

కానిస్టేబుల్‌ను కొట్టిన బీజేపీ మహిళా ఎంపీ!
Rekha Verma

కానిస్టేబుల్‌ను కొట్టిన బీజేపీ మహిళా ఎంపీ! | actioncutok.com

More for you: