పాలిటిక్స్ త‌ర్వాతే సినిమా!


పాలిటిక్స్ త‌ర్వాతే సినిమా!

పాలిటిక్స్ త‌ర్వాతే సినిమా!

విజయశాంతి.. ద‌క్షిణాదిన ఈ పేరే ఒక బ్రాండ్‌. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఈమె.. క్రియాశీల‌క రాజకీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసింది. కాగా, 13 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం.. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో వెండితెరపై దర్శనమివ్వనుంది విజ‌య‌శాంతి.

ఇదిలా ఉంటే.. ఆమె రీ-ఎంట్రీపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటీనటులు సినీ రంగం నుంచి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ క్రీమ్‌ అయిపోగానే మళ్ళీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వారి జాబితాలోకి విజయశాంతి కూడా వచ్చి చేరారనే మాటలు వినిపిస్తున్న సందర్భంలో.. అటువంటి వారికి రాములమ్మ క్లారిటీ ఇచ్చింది.

‘సరిలేరు నీకెవ్వరు’లో త‌న పాత్ర నచ్చి ఆ సినిమా ఒప్పుకున్నట్టు తెలిపింది. అంతేకాదు.. ఆరు నెలల క్రితమే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రంలో క‌థానాయ‌కుడి త‌ల్లి పాత్ర‌లో నటించమని తనని సంప్రదించారని.. కాని ఎల‌క్ష‌న్స్‌ ముందున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కేంపెయిన్ కమిటీ చైర్మన్‌గా ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. (ఇప్పుడు ఆ పాత్రలో టబు నటిస్తోంది). అంతేకాదు, తనకు పాలిటిక్స్ తర్వాతే  సినిమాలు అని క్లారిటీ ఇచ్చిన విజయశాంతి.. సినిమాలో తన పాత్ర నచ్చితే మాత్రం నటించడానికి ఎప్పుడూ సుముఖంగా ఉంటానని పేర్కొంది.

మ‌రి ఇంత క్లారిటీగా ఇచ్చిన స‌మాధానంతోనైనా నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ఆపుతారేమో చూడాలి.

పాలిటిక్స్ త‌ర్వాతే సినిమా! | actioncutok.com

More for you: